ఎన్నారై భర్త ఇంటి ఎదుట భార్య దీక్ష

కృష్ణా జిల్లా గన్నవరంలో ఎన్నారై భర్త ఇంటి ఎదుట భార్య నిరసన దీక్ష చేపట్టారు. కిరణ్మయికి బోర్రా సుధీర్‌ కుమార్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం..

Updated : 19 Jul 2021 04:28 IST

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరంలో ఎన్నారై భర్త ఇంటి ఎదుట భార్య నిరసన దీక్ష చేపట్టారు. కిరణ్మయికి బోర్రా సుధీర్‌ కుమార్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్ని రోజులకే సుధీర్‌ కుమార్‌ ఇటలీ వెళ్లిపోయాడని, కొంత కాలంగా తనను పట్టించుకోకుండా అధిక కట్నం కోసం వేధిస్తున్నారని కిరణ్మయి ఆరోపించారు. భర్త కాల్‌ లిస్ట్‌ చెక్‌ చేయగా ఇటలీలో విజయవాడకు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసిందని కిరణ్మయి ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ గన్నవరంలోని భర్త ఇంటి ఎదుట ఆమె నిరసన దీక్ష చేపట్టారు. కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు బాధితురాలిని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని