Crime News: చందానగర్ లాడ్జిలో ఆ యువతిని కోటిరెడ్డే చంపేశాడా?
చందానగర్‌లోని ఓ లాడ్జిలో మృతిచెందిన ప్రకాశం జిల్లాకు చెందిన యువతి నాగచైతన్య(24)ది హత్యగా పోలీసులు భావిస్తున్నారు.
హైదరాబాద్: చందానగర్‌లోని ఓ లాడ్జిలో మృతిచెందిన ప్రకాశం జిల్లాకు చెందిన యువతి నాగచైతన్య(24)ది హత్యగా పోలీసులు భావిస్తున్నారు. లాడ్జిలో యువతితో ఉన్న కోటిరెడ్డి.. ఆ తర్వాత గదికి తాళం వేసి వెళ్లాడని, అనంతరం తన ఒంటిపై గాయాలు చేసుకుని ఒంగోలు ఆస్పత్రిలో చేరినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోటిరెడ్డే హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. నాగచైతన్యను కోటిరెడ్డి నమ్మించి దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై హత్య కేసుగా నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చందానగర్ సీఐ క్యాస్ట్రో తెలిపారు.
అసలేం జరిగిందంటే..
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా కరవాడి ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు కుమార్తె గొర్రెముంచు నాగ చైతన్య (24). నల్లగండ్ల సిటిజన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తోంది. గుంటూరు జిల్లా రెంట చింతల ప్రాంతానికి చెందిన గాదె కోటిరెడ్డి మెడికల్ రిప్రజంటెటీవ్‌గా పని చేస్తున్నాడు. తరచూ ఆస్పత్రికి వెళ్లే క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. యువతి తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. సవతి తల్లి మాత్రం ఉంది. సామాజిక వర్గాలు వేరు కావడంతో యువకుడి కుటుంబీకులు పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో ఈ నెల 23న ఆసుపత్రి ఎదురు ప్రాంతంలోని ఓ లాడ్జిలో గది తీసుకున్నారు. ఇరువురు కలిసి ఉన్నారు. మరుసటి రోజు ఆదివారం రాత్రి వీరు తీసుకున్న గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది పరిశీలించడంతో గొంతుకోసి రక్తపు మడుగులో నాగచైతన్య మృతి చెంది ఉంది.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రేమికుడు కోటిరెడ్డి పొట్ట, గొంతు దగ్గర కత్తి గాట్లతో ఒంగోలు వెళ్లి ఆసుపత్రిలో చేరినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆమె గొంతు కోసుకుందని, భయంతో తాను వచ్చేశానని కోటిరెడ్డి చెప్పినట్లు సమాచారం. లాడ్జి గదిని పరిశీలించగా గదిలో మద్యం సీసాలతోపాటు రక్తం మడుగును కడగడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగించిన పోలీసులు.. యువతిని కోటిరెడ్డి హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను 5 రోజుల పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అప్పగించింది. -
పార్ట్‌టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
పార్ట్ టైమ్ ఉద్యోగాల స్కామ్‌లో 580 ఖాతాల్లోని రూ.32.34 కోట్లు అటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్‌లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు
మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. -
చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి
తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. -
సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. -
‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. -
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ఓక్రా, ఫైజల్ కస్టడీకి అనుమతి
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్‌లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి