Crime News: అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

నగరంలోని అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ రెండో అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం రాత్రి 8గంటల ప్రాంతంలో ఒక్కసారిగా

Updated : 12 Nov 2021 21:49 IST

హైదరాబాద్‌: నగరంలోని అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ రెండో అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం రాత్రి 8గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మెట్రో స్టేషన్‌ రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించిన యువతి పక్కనే ఉన్న టింబర్‌ డిపోలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు యత్నించిన యువతి టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. బీటెక్‌ చదువుతూ అమీర్‌పేటలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. కుటుంబ సమస్యలా? ఆర్థిక సమస్యలా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని