TS NEWS: తీన్మార్‌ మల్లన్నను 5గంటల పాటు విచారించిన పోలీసులు

చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో తీన్మార్‌ మల్లన్నను పోలీసులు 5గంటల పాటు విచారించారు. అనంతరం విడుదల చేశారు.

Updated : 05 Aug 2021 19:40 IST

సికింద్రాబాద్‌: చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో తీన్మార్‌ మల్లన్నను పోలీసులు 5గంటల పాటు విచారించారు. అనంతరం విడుదల చేశారు. ఈనెల 8న మరోసారి విచారణకు హాజరు కావాలని తెలిపారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని ఈ సందర్భంగా మల్లన్న స్పష్టం చేశారు.

తన ప్రతిష్ఠకు భంగం కలిగించిన తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌పై ఓ యువతి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సహోద్యోగి, స్నేహితుడైన చిలక ప్రవీణ్‌ గత కొంతకాలంగా తీన్మార్‌ మల్లన్న అవినీతి అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా మల్లన్న వ్యవహరిస్తున్నారని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీర్జాదిగూడలోని తీన్మార్‌ మల్లన్న యూట్యూబ్‌ ఛానల్‌పై పోలీసులు మంగళవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. ఒక్కొక్కరుగా కార్యాలయానికి చేరుకున్న పోలీసులు కార్యాలయ సిబ్బందిని బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. పలు పత్రాలు పరిశీలించి, హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని