Gun Fire: అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడి మృతి

అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతిచెందాడు.

Updated : 23 Jun 2024 12:21 IST

కర్లపాలెం: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. మృతుడిని ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)గా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపీకృష్ణ జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. టెక్సాస్‌ రాష్ట్రంలోని డాలస్‌లో ఓ సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్‌లో ఉండగా.. ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలతో గోపి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

ఆ తర్వాత గోపీకృష్ణను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. ఈ సమాచారం తెలియడంతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. గోపి స్వగ్రామం యాజలిలో విషాదఛాయలు అలముకున్నాయి. మరోవైపు దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని