Andhra News: ట్రావెల్స్‌ బస్సుల్లో రూ.5.6 కోట్ల నగదు, 10 కేజీల బంగారం స్వాధీనం

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వద్ద భారీగా నగదు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 01 Apr 2022 17:03 IST

కిర్లంపూడి: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వద్ద భారీగా నగదు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు మండలంలోని కృష్ణవరం గ్రామం జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్తున్న రెండు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను ఆపి తనిఖీ చేయగా.. ఒక బస్సులో 10 కేజీల 100 గ్రాముల బంగారం, మరో బస్సులో రూ.5.60 కోట్ల నగదును గుర్తించినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడకు చెందిన ఇద్దరు బంగారం వ్యాపారులు వీటికి ఏ విధమైన బిల్లులు, జీఎస్టీ చెల్లింపులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. పట్టుబడిన బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని