Gun Fire న్యూయార్క్‌లో కాల్పుల మోత.. 10మంది దుర్మరణం

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. న్యూయార్క్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు.

Updated : 15 May 2022 07:01 IST

న్యూయార్క్‌: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. న్యూయార్క్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పది మంది దుర్మరణం చెందారు. సూపర్‌ మార్కెట్‌లోకి సైనికుడి వేషంలో తుపాకీతో ప్రవేశించిన దుండగుడు.. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుశ్చర్యలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.

దుండగుణ్ని ఎఫ్‌బీఐ అధికారులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నల్లజాతీయులు అధికంగా ఉన్న చోట ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనకు జాతి విద్వేషమే కారణమని వారు భావిస్తున్నారు. ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విచారం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని