AP News: ఆత్మకూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ: గాల్లోకి కాల్పులు

 కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓ వర్గం చేపట్టిన నిర్మాణాన్ని భాజపా నేత బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది.

Updated : 09 Jan 2022 06:27 IST

ఆత్మకూరు పట్టణం: కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓ వర్గం చేపట్టిన నిర్మాణాన్ని భాజపా నేత బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. దీంతో పోలీసులు అతన్ని వెనక్కి పంపించారు. ఈ క్రమంలో శ్రీకాంత్‌ రెడ్డి వాహనాన్ని మరో వర్గం వారు అడ్డుకున్నారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో వాహనం వేగంగా నడపడంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. అక్కడి నుంచి శ్రీకాంత్‌రెడ్డి నేరుగా ఆత్మకూర్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. విషయం తెలుసుకున్న మరో వర్గం వారు పోలీసుస్టేషన్‌ను దిగ్బంధించి శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేశారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు చేశారు. ఘటనపై స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని