Crime news: ఏపీ, తెలంగాణలోని వ్యాపారవేత్తలకు డ్రగ్స్‌ సరఫరా.. పోలీసుల అదుపులో నిందితుడు

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్‌ తీసుకొస్తున్న సాయిచరణ్‌ని టీజీ న్యాబ్‌, మాదాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 22 Jun 2024 16:53 IST

హైదరాబాద్‌: మాదాపూర్‌లో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్‌ తీసుకొస్తున్న సాయిచరణ్‌ని టీజీ న్యాబ్‌, మాదాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి వచ్చే ట్రావెల్స్‌ డ్రైవర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు  గుర్తించారు. డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్న వ్యాపారవేత్తలు మాలిక్‌ లోకేశ్‌, సందీప్‌రెడ్డి, రాహుల్‌, సుబ్రహ్మణ్యంలతో పాటు సాయిచరణ్‌ను నార్కోటిక్‌ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. సాయి చరణ్‌ నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ డ్రగ్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు సాయిచరణ్‌ను పట్టుకున్నారు. నిందితుడు హైదరాబాద్‌, నెల్లూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖలోని దాదాపు 50 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని