Hyderabad: సికింద్రాబాద్‌లో సినీ ఫక్కీలో దోపిడీ మహారాష్ట్ర ముఠా పనేనా?
సికింద్రాబాద్ మార్కెట్ ఠాణా పరిధిలో నిత్యం రద్దీగా ఉండే మోండా మార్కెట్లో పట్టపగలు జరిగిన దోపిడీ ఘటనను పోలీసులు సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ మార్కెట్ ఠాణా పరిధిలో నిత్యం రద్దీగా ఉండే మోండా మార్కెట్లో పట్టపగలు జరిగిన దోపిడీ ఘటనను పోలీసులు సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారులమంటూ బంగారం దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు పనివాళ్లను గదిలో బంధించి 1,700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పారిపోయిన విషయం తెలిసిందే. నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాలు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు చేపట్టాయి. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనేపథ్యంలో కొన్ని బృందాలు మహారాష్ట్ర వెళ్లాయి. చోరీ తర్వాత ఆటోలో జేబీఎస్ వెళ్లిన ముఠా అక్కడి నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. పటాన్‌చెరు మీదుగా మహారాష్ట్ర వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో యజమాని మధుకర్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: అప్పటివరకూ లోకేశ్‌ను అరెస్టు చేయొద్దు: సీఐడీకి హైకోర్టు ఆదేశం
-
Sky bus: స్కైబస్లో కేంద్రమంత్రి గడ్కరీ టెస్టు రైడ్.. త్వరలో ఆ బస్సులు భారత్‌కు!
-
DK Aruna: తెలంగాణ మోడల్ అంటే.. అవినీతి మోడల్: డీకే అరుణ
-
Stock Market: నష్టాల్లోనే మార్కెట్ సూచీలు.. 19,450 దిగువన స్థిరపడ్డ నిఫ్టీ
-
Ranbir Kapoor: రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ సమన్లు
-
Union Cabinet: పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. సిలిండర్‌పై రాయితీ ₹300లకు పెంపు