Teenmaar Mallanna: మల్లన్నను చంచల్‌గూడ జైలు నుంచి ఎడపల్లి తీసుకొచ్చిన పోలీసులు

చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నను చంచల్‌గూడ జైలు నుంచి కోర్టు అనుమతితో నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. డబ్బులు ఇవ్వాలంటూ

Published : 08 Oct 2021 01:36 IST

ఎడపల్లి: చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నను చంచల్‌గూడ జైలు నుంచి కోర్టు అనుమతితో నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. డబ్బులు ఇవ్వాలంటూ జానకంపేట గ్రామానికి చెందిన సంతోష్‌, రాధాకిషన్‌గౌడ్‌, సాయాగౌడ్‌, రాజుగౌడ్‌ అనే వ్యక్తులు తీన్మార్‌ మల్లన్నతో కలిసి బెదిరించారని నిజామాబాద్‌ జిల్లా జానకంపేటకు చెందిన కల్లు ముస్తేదారు(విక్రయదారుడు) జయవర్ధన్‌గౌడ్‌ కొన్ని రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మల్లన్నను రెండురోజులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఇవాళ ఎడపల్లి తీసుకొచ్చారు. బోధన్‌ జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఎడపల్లి స్టేషన్‌కు తీసుకొచ్చి ఏసీపీ రామారావు ఆధ్వర్యంలో మల్లన్నను విచారిస్తున్నారు. ఈ సందర్భంగా మల్లన్న మద్దతు దారులు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమకేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని