Vijayawada: విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న రూ.7.48కోట్ల విలువైన బంగారం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.7.5 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని విజయవాడ రైల్వే స్టేషన్‌ వద్ద పట్టుకున్నారు.

Updated : 22 Mar 2023 18:19 IST

విజయవాడ: అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని విజయవాడ రైల్వే స్టేషన్‌ వద్ద పట్టుకున్నారు. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బంగారం తరలిస్తున్నట్టు పక్కా సమాచారం తెలుసుకున్న కస్టమ్స్‌ అధికారులు విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద నిఘాపెట్టారు. తొలుత ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 5కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అదుపులో ఉన్న వారు ఇచ్చిన సమాచారంతో మరికొందరిని అదుపులోకి తీసుకుని 7.97 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పట్టుబడిన బంగారంలో కొంత బిస్కెట్ల రూపంలో, మరికొంత ఆభరణాల రూపంలోను ఉన్నట్టు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని