Crime news: నగలు చోరీ చేసి దొంగల బీభత్సం.. బైక్‌పై వెళ్తూ గాల్లోకి కాల్పులు!

రెండు రోజుల వ్యవధిలోనే దేశ రాజధాని నగరంలో మరో నగల దుకాణంలో చోరీ  ఘటన కలకలం రేపుతోంది. నగలు చోరీ చేసిన ముగ్గురు దొంగలు బైక్‌పై వెళ్తూ గాల్లోకి కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు.

Published : 27 Sep 2023 18:53 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నగరంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. సమయ్‌పూర్‌ బద్లీ అనే ప్రాంతంలోని ఓ నగల దుకాణంలోకి చొరబడిన ముగ్గురు దొంగలు సిబ్బందికి తుపాకీ గురిపెట్టి చోరీకి పాల్పడ్డారు. అనంతరం తప్పించుకొనే ప్రయత్నంలో బైక్‌పై వెళ్తూ గాల్లోకి కాల్పులు జరిపి బీభత్సం సృష్టించడం తీవ్ర కలకలం రేపింది. హెల్మెట్లు ధరించి చొరబడిన దుండగులు శ్రీరామ్‌ జ్యువెలరీ దుకాణంలో దాదాపు 500 గ్రాములతో పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు దొంగలు ఆయుధాలతో చొరబడ్డారని, సిబ్బందికి తుపాకీ గురిపెట్టి ప్రదర్శనకు ఉంచిన ఆభరణాలన్నింటినీ దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు. వీటి విలువను యజమానులు మదింపు చేస్తున్నారన్నారు. వీటి విలువ దాదాపు రూ.30లక్షలు ఉంటుందని అంచనా.

చిన్నతల్లికి ఎంత కష్టం.. అత్యాచారానికి గురై వీధిలో రక్తమోడుతూ సాయం కోరితే..!

అయితే, ఈ మధ్యాహ్నం 2గంటల సమయంలో తమకు ఫోన్‌ రాగా.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించినట్టు చెప్పారు.  అక్కడి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ముగ్గురు దుండగులు బైక్‌పై వెళ్తూ గాల్లోకి కాల్పులు జరిపిన దృశ్యాలను గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   దక్షిణ దిల్లీలోని భోగాల్‌ ప్రాంతంలో ఉమ్రావ్‌ జ్యువెలరీ దుకాణంలో ₹20 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ ఘటన జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే తాజా ఘటన చోటుచేసుకోవడం కలవరపెడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని