Shadnagar: షాద్‌నగర్‌లో విషాదం.. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారుల మృతి

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో విషాదం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని

Updated : 26 Sep 2022 12:07 IST

షాద్‌నగర్‌ పట్టణం: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో విషాదం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్‌ శివారులో నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన అక్షిత్ గౌడ్‌, ఫరీద్‌, ఫరీన్‌ ఈ ఉదయం ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. ఓ చోట వెంచర్‌ కోసం వేసిన స్థలంలో నీరు నిలవగా.. అందులో చేపలు పట్టేందుకు దిగారు. ఈ క్రమంలో ఈత రాక మునిగిపోయి ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు.

చిన్నారుల కోసం వెతుకుతూ అక్కడికి వచ్చిన వారి తల్లిదండ్రులకు మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. మృతిచెందిన చిన్నారుల వయసు పదేళ్లలోపే ఉంది. కుమారుల మృతితో వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. నీటి గుంత నుంచి మృతదేహాలను గ్రామస్థులు వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts