ముగ్గురు పిల్లలకు ఉరివేసి..తల్లి బలవన్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో విషాదం చోటు చేసుకుంది.

Updated : 08 Jul 2021 13:16 IST

చౌటుప్పల్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలకు ఉరివేసి, తల్లి కూడా బలవన్మరణానికి పాల్పడింది. రామ్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌, రాణి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. భర్త మద్యానికి బానిసవ్వడం, కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో రాణి మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ముగ్గురు పిల్లలకు చీరతో ఉరిబిగించి, తానూ బలవన్మరణానికి పాల్పడింది. చిన్న కుమార్తె మెడనుంచి చీర జారిపోవడంతో ఆమె బయటపడింది. తల్లి ఉమారాణి (31)తోపాటు ఇద్దరు కుమార్తెలు హర్షిణి (13), లక్కీ (11) ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో చౌటుప్పల్‌లో విషాదం ఛాయలు అలముకున్నాయి. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని