
Hindupur: ముగ్గురు కరోనా బాధితుల మృతి
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఉదయం ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు. ఆక్సిజన్ అందకే వీరు మరణించినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి.. ముగ్గురు మృతిచెందడానికి కారణమైన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.