Crime News: ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం.. ముగ్గురి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలోని ఔటర్‌రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద ఆగి ఉన్న లారీని కారు అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో చిక్కుకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతులను మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది.. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులు హయత్‌నగర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
గోరంట్ల వీడియోపై కేంద్ర ల్యాబ్‌లో పరీక్షలు చేయించండి.. అమిత్‌షాకు హైకోర్టు న్యాయవాది లేఖ
-
Ts-top-news News
TSLPRB: ఎస్సై పరీక్షలో 8 ప్రశ్నల తొలగింపు
-
Ts-top-news News
Hyderabad: మహిళ చెర నుంచి నా కుమారుడిని కాపాడండి.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి
-
Ts-top-news News
ట్యాంక్‌బండ్‌పై నేడు చక్కర్లు కొట్టనున్న నిజాం కాలంనాటి బస్సు
-
Ts-top-news News
SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల పెళ్లి సందడి.. టీజర్ చూశారా!
- Crime News: సినిమా చూసి.. మూఢవిశ్వాసంతో బలవన్మరణం
- Rishabh Pant: రిషభ్ పంత్‌కు కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ నటి..
- The Great Khali: అభిమానుల చర్యకు ఏడ్చేసిన ‘ది గ్రేట్ ఖలీ’