
Updated : 20 Jan 2022 16:19 IST
Crime News: జగిత్యాలలో దారుణం.. తండ్రి, ఇద్దరు కుమారుల హత్య
జగిత్యాల: జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని తారకరామనగర్‌లో తండ్రి నాగేశ్వరరావు, ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్‌లను ప్రత్యర్థులు హత్య చేశారు. కుల సంఘం సమావేశం జరుగుతుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మంత్రాల నెపంతో ఈ ముగ్గురిని హత్య చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అదనపు ఎస్పీ రూపేష్‌కుమార్, డీఎస్పీ ప్రకాశ్, సీఐ కృష్ణకుమార్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.
Tags :