రుణం ఇప్పిస్తామని రూ.20 లక్షలు టోకరా

రూ.90 కోట్ల రుణం ఇప్పిస్తామంటూ కేటుగాళ్లు ఓ వ్యాపారి దగ్గర రూ.20 లక్షలు కాజేశారు. ఎర్రమంజిల్‌లో నివాసముంటున్న నాగేశ్వరరావు..

Published : 14 Jan 2021 01:18 IST


హైదరాబాద్‌: రూ.90 కోట్ల రుణం ఇప్పిస్తామంటూ కేటుగాళ్లు ఓ వ్యాపారి దగ్గర రూ.20 లక్షలు కాజేశారు. ఎర్రమంజిల్‌లో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు పశ్చిమగోదావరి జిల్లాలో ఓ పేపర్‌ కంపెనీని నడుపుతున్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో రుణం కోసం ప్రయత్నించారు. మాదాపూర్‌కు చెందిన సవేర ఏజెన్సీస్‌ నిర్వాహకులు నాగరాజు, లీలాకాంత్‌, చింతేశ్వరావు రూ. 20 లక్షలు కడితే రూ.90 లక్షల లోన్‌ ఇప్పిస్తామంటూ నాగేశ్వరరావుకు తెలిపారు. దీంతో నాగేశ్వరరావు వారికి రూ. 20 లక్షలు ముట్టజెప్పారు. అయితే నిందితులు రుణం మంజూరు అయినట్లు గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీస్‌ నుంచి నకిలీ మంజూరీ పత్రాన్ని నాగేశ్వరరావుకి ఇచ్చారు. రుణం విడుదల కావడంలో జాప్యం జరుగుతుండడంతో మోసపోయానని గ్రహించిన నాగేశ్వరరావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  
ఇవీ చదవండి..
దా‘రుణ’ యాప్‌లు: 90శాతం వారివే!


బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. సజీవ దహనం!
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని