Crime News: చేపల వేటకు వెళ్లి ఒకరు.. కాపాడేందుకు వెళ్లి మరో ఇద్దరు గల్లంతు

చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు కాగా అతడిని వెతికేందుకు వెళ్లిన మరో  ఇద్దరు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 11 Aug 2022 22:32 IST

నేలకొండపల్లి: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు కాగా అతడిని వెతికేందుకు వెళ్లిన మరో  ఇద్దరు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్ధేపల్లి వద్ద పాలేరు ఏరులో చేపలు పట్టేందుకు చెన్నారం గ్రామానికి చెందిన పగడాల రంజిత్‌(26) మరో ముగ్గురితో కలిసి వెళ్లాడు. చేపలు పడుతూ రంజిత్‌ ప్రమాదవశాత్తు చెక్‌డ్యాం అవతల పడిపోయాడు. రంజిత్‌ కోసం స్థానికులు, బంధువులు గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సూచన మేరకు ఖమ్మం నుంచి డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని రప్పించారు. సాయంత్రం 4గంటల సమయంలో బృంద సభ్యులు నలుగురు రంజిత్‌ కోసం గాలింపు చేపట్టారు. వీరిలో బోశెట్టి ప్రదీప్‌(32), పడిగెల వెంకటేశ్వర్లు(29) ఏరులో కొట్టుకుపోయారు. వీరిలో వెంకటేశ్వర్లు మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. ప్రదీప్‌ కోసం గాలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి, ఖమ్మం గ్రామీణ ఏసీపీ బసవారెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు