TSPSC: పేపర్‌ లీకేజీ కేసు.. ముగ్గురికి 14 రోజుల రిమాండ్‌

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ బృందం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురిని సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

Published : 23 Mar 2023 18:21 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్‌ లీకేజీ కేసులో నాంపల్లి కోర్టు ముగ్గురికి రిమాండ్‌ విధించింది. ఈ కేసులో గురువారం అరెస్టయిన రమేశ్‌, సురేశ్‌, షమీమ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. 2013లో గ్రూప్‌-2 ఉద్యోగం పొందిన షమీమ్‌కు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 127 మార్కులు, టీఎస్‌పీఎస్సీలో పొరుగుసేవల ఉద్యోగిగా పని చేస్తున్న రమేశ్‌కు 122 మార్కులు వచ్చినట్లు సిట్‌ బృందం గుర్తించింది. లీకేజీ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న రాజశేఖర్‌ నుంచి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం తీసుకున్నట్లు షమీమ్‌ తెలిపాడు. దీనికోసం డబ్బులేమీ తీసుకోలేదని చెప్పాడు. దీంతో షమీమ్‌ ఇచ్చిన ఆధారాల మేరకు వీరిని సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు ఆదేశాలతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని