Tirumala: తిరుమలలో ఇద్దరు దళారుల అరెస్టు

తిరుమలలో అక్రమంగా అద్దె గదులు పొంది, వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు దళారులను తితిదే విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు.

Published : 10 Jul 2024 03:18 IST

వివరాలు వెల్లడిస్తున్న సీఐ సత్యనారాయణ

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో అక్రమంగా అద్దె గదులు పొంది, వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు దళారులను తితిదే విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. వారిపై తిరుమల టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సీఐ సత్యనారాయణ వివరాల మేరకు.. కృష్ణా జిల్లా పోచవరానికి చెందిన నాగ బ్రహ్మచారి, వరంగల్‌కు చెందిన వెంకటేశ్వరరావు ఆధార్‌ కార్డ్‌పై ఫొటో కనిపించకుండా గదులు పొంది.. వాటిని అవసరం ఉన్న భక్తులకు అధిక ధరలకు ఇస్తున్నారు. ఇలా 2 నెలల్లో 45 గదులకు పైగా నిందితులు పొందినట్లు సీఆర్వోలోని కరెంట్‌ బుకింగ్‌ ఫేస్‌ రికగ్నైషన్‌(ఎఫ్‌ఆర్‌) టెక్నాలజీ ద్వారా గుర్తించారు. ఇదే విధంగా గదులు పొంది, అధిక ధరలకు ఇస్తున్న 15 మందిని గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టాక.. తరచూ గదులు పొందుతున్న వారి వివరాలు తితిదే ఐటీశాఖ సేకరించింది. వాటి ఆధారంగా విజిలెన్స్, పోలీసు విభాగం నిందితులను గుర్తిస్తోంది. గతంలో ఈ తరహా నేరాలకు పాల్పడ్డ ఐదుగురిని బైండోవర్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని