West Bengal: పాయింట్‌ బ్లాంక్‌లో గన్‌ పెట్టి.. తృణమూల్‌ కౌన్సిలర్‌ దారుణహత్య

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఒకే రోజు ఇద్దరు కౌన్సిలర్లు దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. ఇందులో ఒకరిని దుండగుడు పాయింట్‌ బ్లాంక్‌లో గన్‌ పెట్టి కాల్చివేసిన

Updated : 15 Mar 2022 04:23 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఒకే రోజు ఇద్దరు కౌన్సిలర్లు దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. ఇందులో ఒకరిని దుండగుడు పాయింట్‌ బ్లాంక్‌లో గన్‌ పెట్టి కాల్చివేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్‌ అయ్యాయి. ఆదివారం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ రెండు హత్యలు చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పానిహతి మున్సిపాలిటీకి చెందిన టీఎంసీ కౌన్సిలర్‌ అనుపమ్‌ దత్తా ఆదివారం హత్యకు గురయ్యారు. నిన్న సాయంత్రం అగర్‌పరా ప్రాంతంలో అనుపమ్‌ దత్తా ఓ దుకాణం నుంచి బయటకు వచ్చి స్కూటీపై వెనుక కూర్చున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన దుండగుడు అనుపమ్ తలకు తుపాకీ పెట్టి కాల్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనుపమ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ద్వారా నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు కాంట్రాక్ట్‌ కిల్లర్‌ అని సమాచారం. కాగా.. ఈ ఘటనకు కొద్ది గంటల ముందే పురులియా ప్రాంతంలో కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ తపన్‌ కుందును గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తపన్‌ కుందు తన ఇంటికి సమీపంలో వాకింగ్‌ చేస్తుడగా.. బైక్‌పై వచ్చిన దుండుగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తపన్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఇద్దరి హత్యలకు సంబంధం ఉందా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని