Karimnagar: కొనుగోలు కేంద్రంలో నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

మండల కేంద్రంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది.

Published : 27 May 2023 10:09 IST

తిమ్మాపూర్‌: మండల కేంద్రంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. వచ్చునూర్‌లోని ఐకేపీ కేంద్రంలో నిద్రిస్తున్న రైతుపైకి ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. వచ్చునూర్ గ్రామానికి చెందిన ఉప్పులేటి మొండయ్య(65) అనే రైతు తన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి రాత్రి అక్కడే నిద్రించాడు. తనపై టార్పాలిన్‌ కవర్‌ కప్పుకొని నిద్రపోయాడు. తెల్లవారుజామున ధాన్యం లోడుతో రైస్ మిల్లుకు వెళ్లే క్రమంలో.. టార్పాలిన్‌ కింద నిద్రపోయిన రైతును గమనించని డ్రైవర్‌.. రైతుపైకి దూసుకెళ్లాడు. దీంతో మొండయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని