Crime news: బాపట్ల జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతిచెందగా.. మరొకరు గల్లంతైన ఘటన వేటపాలెం మండలం రామాపురం తీరంలో చోటు చేసుకుంది.

Updated : 21 Jun 2024 18:23 IST

వేటపాలెం: స్నేహితులతో సరదాగా తీరంలో గడిపేందుకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతిచెందగా.. మరొకరు గల్లంతైన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం తీరంలో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నలుగురు యువకులు సరదాగా గడిపేందుకు రామాపురం సముద్ర తీరానికి చేరుకున్నారు. అయితే అలల తాకిడి తీవ్రం కావడంతో నలుగురు యువకులు గల్లంతయ్యారు. కాసేపటికే మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరొకరి ఆచూకీ తెలియరాలేదు. మృతి చెందినవారిని నితిన్, అమలరాజ, కిషోర్‌గా గుర్తించారు. నాని అనే యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని