TSRTC: బైక్‌ ఢీకొనడంతో ప్రమాదం.. దగ్ధమైన ఆర్టీసీ రాజధాని బస్సు

సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో ఆర్టీసీ బస్సు-ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి.

Updated : 30 Mar 2023 11:03 IST

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో ఆర్టీసీ బస్సు-ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. తెలంగాణ ఆర్టీసీకి చెందిన రాజధాని బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇందిరానగర్‌ వద్దకు చేరుకోగానే బస్సును ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు కింది భాగంలోకి బైక్‌ వెళ్లడంతో మంటలు చెలరేగాయి. దీంతో మంటలు బస్సుకు వ్యాపించాయి. ప్రమాదం జరగడంతో అందులోని ప్రయాణికులంతా వెంటనే కిందికి దిగిపోయారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ద్విచక్ర వాహనదారుడు మురుగేష్‌ రాజు (48)కి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని సూర్యాపేట తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు