Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు

పాతబస్తీలో సిగ్నల్‌ వద్ద నిలిచి ఉన్న ఆటోను వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

Updated : 24 Sep 2023 20:27 IST

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో పెను ప్రమాదం తప్పింది. జూపార్కు నుంచి పురానాపూల్‌ వైపు వెళ్తున్న ఆటోను బహదూర్‌పురా క్రాస్‌ రోడ్డు సిగ్నల్‌ వద్ద వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. ఆర్టీసీ బస్సు రాజేంద్రనగర్‌ డిపోకి చెందినదిగా గుర్తించారు. సంఘటన స్థలాన్ని బహదూర్‌పురా సీఐ పరిశీలించారు. బస్సు బ్రేకులు ఫెయిల్‌ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సు వేగంగా వచ్చి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని