రాజస్థాన్‌లో పడవ ప్రమాదం: 12మంది గల్లంతు

రాజస్థాన్‌లోని ఖటోలీలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. బుండి జిల్లాలోని కమలేశ్వర్‌ మహదేవ్‌ ఆలయానికి 40 మంది భక్తులతో చంబల్‌ నదిలో వెళ్తున్న పడవ మునిగిపోయింది. దీంతో పడవలో ఉన్న వారిలో దాదాపు 12 మంది గల్లంతు కాగా.. మరో 25 మంది సురక్షితంగా బయటపడ్డారు.

Published : 17 Sep 2020 01:28 IST

జైపూర్‌: రాజస్థాన్‌లోని ఖటోలీలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. బుండి జిల్లాలోని కమలేశ్వర్‌ మహదేవ్‌ ఆలయానికి 40 మంది భక్తులతో వెళ్తున్న పడవ చంబల్‌ నదిలో మునిగిపోయింది. దీంతో పడవలో ఉన్న వారిలో దాదాపు 12 మంది గల్లంతు కాగా.. మరో 25 మంది సురక్షితంగా బయటపడ్డారు. కోట రూరల్‌ ఎస్పీ శరద్‌ చౌదరీ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుండి జిల్లాలోని ఇందర్‌ఘర్‌ ప్రాంతంలో ఉన్న దేవస్థానానికి 40 మంది పడవలో బయలుదేరారు. చంబల్‌ నది గుండా వెళ్తుండగా ప్రమాదవశాత్తు పడవ నీట మునిగి పోవడంతో దాదాపు 12 మంది గల్లంతయ్యారు. మరో 25 మంది ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు