ఈజిప్టులో ఘోరరోడ్డు ప్రమాదం: 20మంది మృతి

ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును ఓవర్‌టేక్‌ చేయబోయి ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 20 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ మేరకు అక్కడి స్థానిక అధికారులు బుధవారం ధ్రువీకరించారు. 

Published : 15 Apr 2021 01:19 IST

కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును ఓవర్‌టేక్‌ చేయబోయి ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 20 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ మేరకు అక్కడి స్థానిక అధికారులు బుధవారం ధ్రువీకరించారు. 

దక్షిణ ప్రావిన్స్‌ గవర్నర్‌ ఎసామ్‌ సాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ప్రావిన్స్‌లో కైరో నగరానికి 320 కిలోమీటర్ల దూరంలో ఓ బస్సు అదుపుతప్పి  ప్రమాదానికి గురైంది. బోల్తాపడిన బస్సు, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇప్పటికే ప్రమాద స్థలంలో రెస్క్యూటీమ్స్‌ రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు గవర్నర్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని