MLC Ananthababu: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో ట్విస్ట్‌

ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో ట్విస్ట్‌. హత్యకు గురైన అపార్టుమెంట్‌ వద్ద సీసీ కెమెరా దృశ్యాలు తాజాగా 

Published : 25 May 2022 01:22 IST

కాకినాడ: ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో ట్విస్ట్‌. హత్యకు గురైన అపార్టుమెంట్‌ వద్ద సీసీ కెమెరా దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 19న రాత్రి 10.30 గంటల సమయంలో అపార్టుమెంట్‌ వద్ద గొడవ జరగలేదని వాటిలో నమోదైంది. నిన్న ఎస్పీ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ అపార్టుమెంట్‌ వద్ద జరిగిన గొడవలో సుబ్రహ్మణ్యం కింద పడిపోవడం వల్లే చనిపోయాడని చెప్పిన విషయం తెలిసిందే. ఆ రోజు రాత్రి 12గంటలకు అనంతబాబు హడావుడిగా భార్యతో తిరిగివచ్చినట్లు.. మళ్లీ ఒంటిగంటకు వెళ్లిపోయినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో నమోదైంది.

మరోవైపు అనంతబాబు నివాసం ఉండే అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌ శ్రీను పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. ‘‘చనిపోయిన సుబ్రహ్మణ్యంకు బాబాయి అవుతాను. పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరగలేదు. ఎస్పీ చెప్పినట్లు ఇక్కడ ఎలాంటి గొడవ జరగలేదు. ప్రమాదంలో చనిపోయాడని సుబ్రహ్మణ్యం తండ్రి నాకు ఫోన్‌ చేసి చెప్పారు. అదే సమయంలో అనంతబాబు కంగారుగా వెళ్లిపోయారు. అనంతబాబుతో ఆయన భార్య కూడా ఉన్నారు. సాయంత్రం 4గంటలకు భార్యతో వెళ్లి అర్ధరాత్రి 12గంటలకు తిరిగి వచ్చారు. పోలీసులు ఎవరూ మా దగ్గరకు రాలేదు’’ అని వాచ్‌మెన్‌ శ్రీను తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని