Phone tapping: ఎక్కడికీ పారిపోను.. కోలుకున్నాక మీ ముందుకొస్తా: ప్రభాకర్‌రావు లేఖ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 11 Jul 2024 10:17 IST

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్‌ 23న ఆయన జూబ్లీహిల్స్‌ పోలీసులకు లేఖ రాశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో తనకు సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. జూన్‌ 26న తాను భారత్‌కు రావాల్సిందని.. ఆరోగ్యం బాగోలేక అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందని వివరించారు. క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు చెప్పారు. అమెరికా వైద్యుల సూచనతో అక్కడే చికిత్స పొందుతున్నట్లు ప్రభాకర్‌రావు తెలిపారు.

‘‘నాకు గతంలో ఉన్న మలిగ్నెంట్ క్యాన్సర్‌తో పాటు ఇప్పుడు బీపీ పెరిగింది. నాపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారు. నేను, నా కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఓ పోలీసు అధికారిగా ఎలాంటి తప్పు చేయలేదు. చట్టపరంగా విచారణ జరిపించాలని కోరుతున్నాను. దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. టెలీకాన్ఫరెన్స్‌లో, మెయిల్‌ ద్వారా సమాచారం ఇవ్వడానికైనా సిద్ధం. క్రమశిక్షణ గల అధికారిని.. విచారణ ఎదుర్కొంటా. ఎక్కడికీ తప్పించుకుని పారిపోయే పరిస్థితి లేదు. పూర్తిగా కోలుకున్నాక మీ ముందు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని విచారణాధికారికి చెబుతాను’’ అని ప్రభాకర్‌రావు లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని