
Crime News: ఖమ్మంలో విషాదం.. చెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మృతి
ఖమ్మం నేరవిభాగం: ఖమ్మంలోని బ్రాహ్మణ బజారులో విషాదం చోటు చేసుకుంది. ఓ ఖాళీ స్థలంలో చిన్నారులు ఆడుకుంటుండగా భారీ వృక్షం కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం సాయంత్రం ఆరుగురు చిన్నారులు బ్రాహ్మణ బజారులోని ఖాళీస్థలంలో ఆడుకునేందుకు వెళ్లారు. ఈక్రమంలో అక్కడున్న ఓ చెట్టు కూలి పక్కనున్న గోడపై పడింది. దీంతో గోడ కిందపడి దిగాంత్ శెట్టి (11), రాజ్‌పుత్ ఆయుష్ (6) మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు చిన్నారులు ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని మేయర్ నీరజ, ఏఈ నర్సయ్య, అగ్నిమాపక అధికారులు పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.