కరోనాతో ఇద్దరు అటవీ అధికారుల మృతి

ఆదిలాబాద్‌ జిల్లాలో ఇద్దరు అటవీశాఖ అధికారులు కరోనాతో మృతిచెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు అధికారులు వేర్వేరు చోట్ల విధులు నిర్వర్తి్స్తూ వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని భీంపూర్‌ గ్రామానికి చెందిన రాఠోడ్‌ ఈశ్వర్‌ (50) ఆదిలాబాద్‌ సెక్షన్..

Published : 15 Apr 2021 01:09 IST

నార్నూరు: ఆదిలాబాద్‌ జిల్లాలో ఇద్దరు అటవీశాఖ అధికారులు కరోనాతో మృతిచెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు అధికారులు వేర్వేరు చోట్ల విధులు నిర్వర్తిస్తూ వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని భీంపూర్‌ గ్రామానికి చెందిన రాఠోడ్‌ ఈశ్వర్‌ (50) ఆదిలాబాద్‌ సెక్షన్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తుండగా.. జాదవ్‌ సునీల్‌ (36) నేరడిగొండలో బీట్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. వీరిద్దరికీ కొన్నిరోజుల క్రితం కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అప్పటినుంచి ఆదిలాబాద్‌ రిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన ఇద్దరు అధికారులు ఒక్కరోజే చనిపోవడంతో భీంపూర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అధికారుల మృతిపై జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ రాఠోడ్‌ జనార్దన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాలను రిమ్స్‌ నుంచి భీంపూర్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని