Crime News: విహారయాత్రలో విషాదం.. సముద్రంలో మునిగి ఇద్దరు యువకులు మృతి

స్నేహితులతో కలిసి సరదాగా సముద్రతీరంలో గడిపేందుకు వచ్చిన ఇద్దరు యువకులు మృతి చెందారు. 

Updated : 23 Jun 2024 16:52 IST

వేటపాలెం: స్నేహితులతో కలిసి సరదాగా సముద్రతీరంలో గడిపేందుకు వచ్చిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరం వద్ద చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని బార్గవపేటకు చెందిన పది మంది యువకులు ఆదివారం సరదాగా గడిపేందుకు రామాపురం సముద్రతీరానికి వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా బాలసాయి (25), బాలనాగేశ్వరరావు (27) అలల ధాటికి గల్లంతయ్యారు. తోటి స్నేహితులు గాలించి వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారిద్దరు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని