
Updated : 28 Jan 2022 04:21 IST
kurnool : కర్నూలు జిల్లాలో జంట హత్యల కలకలం
కౌతాళం : కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. కౌతాళం మండలం కామవరంలో భూముల అంశంపై... వైకాపా, భాజపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో వేట కొడవళ్ళతో దాడి చేసి అత్యంత కిరాతకంగా ప్రత్యర్థులను చంపేశారు. చనిపోయిన ఇద్దరిని వైకాపాకు చెందిన శివప్ప, ఈరన్నగా గుర్తించారు. శివప్ప స్థానిక సర్పంచ్ సోదరుడని పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణలో మరో ముగ్గురికి గాయాలు కాగా.. చికిత్స కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Tags :