రెండు రైళ్లు ఢీకొని.. ఈజిప్ట్‌లో 32మంది మృతి!
ఈజిప్ట్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కైరోకి సమీపంలో రెండు పాసింజర్ రైళ్లు పరస్పరం ఢీకొట్టడంతో .....
కైరో: ఈజిప్ట్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కైరోకి సమీపంలో రెండు పాసింజర్ రైళ్లు పరస్పరం ఢీకొట్టడంతో 32మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో 66మందికి గాయాలైనట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దక్షిణ కైరోకు 460 కి.మీల దూరంలోని షోహాగ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొట్టడంతో నాలుగు బోగీలు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఘటనా స్థలానికి 36 అంబులెన్స్‌లు చేరుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి డాక్టర్ ఖలీద్ మెజాహెద్ వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Unemployment allowance: యువతకు నిరుద్యోగ భృతిపై ఛత్తీస్‌గఢ్ సీఎం ప్రకటన
-
Movies News
OTT Movies: ఈవారం ఓటీటీలో వచ్చే సినిమాలు/వెబ్‌సిరీస్‌లు
-
Politics News
Nara Lokesh - Yuvagalam: తెదేపాలో యువోత్సాహం.. లోకేశ్ పాదయాత్ర సాగేదిలా..!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Padma Shri: రూ.20తో పేదలకు వైద్యం..ఎందరికో ఆదర్శప్రాయం
-
General News
Telangana News: తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు: తమిళి సై