కాల్వలోకి దూసుకెళ్లిన కారు: ఇద్దరి మృతి

కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ కుటుంబ సోమవారం అర్ధరాత్రి కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి...

Published : 05 Aug 2020 00:19 IST

అవనిగడ్డ: కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ కుటుంబ సోమవారం అర్ధరాత్రి కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి కారులో బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు అవనిగడ్డ-విజయవాడ కృష్ణా కరకట్టపై అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈప్రమాదంలో విస్సంశెట్టి దుర్గా మహలక్ష్మి(32), కుమారుడు శ్రీమంత్‌(6) మృతి చెందారు. కిరణ్‌ కుమార్‌, 11 నెలలబాబు  ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts