Road Accident: 5 రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో వరుడి మృతి!

మరో ఐదు రోజుల్లో ఆ యువకుడి పెళ్లి. ఏడు అడుగుల బంధంతో సరికొత్త జీవితం ప్రారంభించేందుకు..

Published : 07 Feb 2022 11:05 IST

అల్లూరు: మరో ఐదు రోజుల్లో ఆ యువకుడి పెళ్లి. ఏడు అడుగుల బంధంతో సరికొత్త జీవితం ప్రారంభించేందుకు.. చకచకా అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. బంధుమిత్రులందరికీ వివాహా ఆహ్వాన పత్రికలు సైతం పంచి పెట్టారు. కానీ అంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో ఆ యువకుడిని విధి బలి తీసుకోవడం.. కుటుంబసభ్యుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కర్నూలు జిల్లా అల్లూరు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని.. సోమశేఖర్, నాగరాజు అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సోమశేఖర్‌కు ఈ నెల 12న వివాహం జరగాల్సి ఉంది. మరో మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి మరణంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని