
Crime News: క్యాబ్‌లో మహిళపై అత్యాచారం.. నిందితుడు ఆంధ్రప్రదేశ్ వాసి
బెంగళూరు: ఊబర్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడైన క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. కర్ణాటకలో కలకలం రేపిన ఈ అంశాన్ని ప్రతిపక్షాలు అసెంబ్లీలోనూ లేవనెత్తాయి. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
జార్ఖండ్‌కు చెందిన ఓ మహిళ కొన్నేళ్లుగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఆమె హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉండే తన స్నేహితురాలి ఇంటికి పార్టీకి వెళ్లింది. పార్టీ అనంతరం మురుగేశ్ పాళ్యలోని తన ఇంటికి వెళ్లేందుకు బుధవారం తెల్లవారుజామున ఉబర్ క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్‌లో తన ఇంటి సమీపానికి చేరుకున్నాక.. ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి డ్రైవర్ తనపై శారీరకంగా దాడి చేశాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తర్వాత తనను క్యాబ్‌లోనుంచి తోసేశాడని తెలిపింది.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు క్యాబ్ డ్రైవర్ దేవరాజ్‌ను అరెస్టు చేశారు. అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు. బాధిత మహిళ క్యాబ్ ఎక్కగానే నిద్రపోయిందని.. దీనిని అదునుగా తీసుకున్న నిందితుడు క్యాబ్‌ను ఆమె ఇంటి సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. డ్రైవర్ తన క్యాబ్‌ను దాదాపు 20 నిమిషాల పాటు ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉంచినట్లు గుర్తించారు. ఇతర ఆధారాలను సైతం సేకరించినట్లు తెలిపారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు అసెంబ్లీలో అత్యాచార ఘటనల సెగ తగిలింది. ఆగస్టు 24న జరిగిన మైసూరు గ్యాంగ్ రేప్‌తోపాటు తాజా క్యాబ్ డ్రైవర్ అత్యాచారం ఘటనలను అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తాయి. ఈ నేపథ్యంలోనే బసవరాజ్ మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తులో ఎలాంటి జాప్యం జరగబోదని, నేరం నిర్ధారణ అయిన వెంటనే దోషులపై చట్టపరమైన చర్యలు చేపడతామని అసెంబ్లీలో వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
-
India News
Digital India: ఆన్లైన్ వ్యవస్థతో ‘క్యూ లైన్’ అనే మాటే లేకుండా చేశాం: మోదీ
-
Sports News
IND vs ENG: జో రూట్ హాఫ్ సెంచరీ.. 200 దాటిన ఇంగ్లాండ్ స్కోర్
-
India News
Tamil Nadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ
-
India News
Eknath Shinde: పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తాం.. శిందే కీలక ప్రకటన
-
Movies News
Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- బిగించారు..ముగిస్తారా..?
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు