Telangana News: వరంగల్‌ టెస్కోలో అగ్నిప్రమాదం ఘటన.. అదుపులోకి రాని మంటలు

వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం సమీపంలోని రాష్ట్ర చేనేత సహకార సంఘం(టెస్కో) పరిశ్రమలో మంటలు ఇప్పటికీ అదుపులోకి రాలేదు.

Updated : 12 Apr 2022 14:19 IST

గీసుకొండ: వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం సమీపంలోని రాష్ట్ర చేనేత సహకార సంఘం(టెస్కో) పరిశ్రమలో మంటలు ఇప్పటికీ అదుపులోకి రాలేదు. నిన్న సాయంత్రం పరిశ్రమలో అగ్నిప్రమాదం జరగ్గా మంటలను నియంత్రించడానికి రాత్రి నుంచి ఐదు అగ్నిమాపక శకటాలు నియంతరాయంగా పని చేస్తున్నాయి. మంటలను అదుపుచేయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా మంటలను అదుపు చేస్తామని.. ప్రమాదానికి కారణాలేంటో తెలియాల్సి ఉందని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ప్రమాదంపై విచారణ జరిపి కారణాలను పోలీసులు బహిర్గతం చేయాలని చేనేత సంఘం నాయకులు కోరుతున్నారు. ప్రమాదం వల్ల సుమారు రూ.35 కోట్ల విలువైన వస్త్రాలు బుగ్గిపాలయ్యాయని టెస్కో మేనేజర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని