Andhra News: రుయాలో అమానవీయం.. కుమారుడి మృతదేహంతో బైక్‌పై స్వగ్రామానికి..

తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌

Updated : 26 Apr 2022 14:33 IST

తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పదేళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ సిబ్బంది వ్యవహరించిన తీరు దారుణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన మామిడితోటలో కూలీగా చేసే వ్యక్తి తన కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల తిరుపతి రుయాకు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ కిడ్నీ, కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో బాలుడు నిన్న రాత్రి 11గంటల సమయంలో మృతిచెందాడు. బాలుడిని తిరుపతి నుంచి 90కి.మీ. దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి రుయా అంబులెన్స్‌ డ్రైవర్లను అడగ్గా రూ.10వేలు అవుతుందని చెప్పారు. అంత మొత్తం భరించలేని తండ్రి ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తమ బంధువులకు తెలియజేయడంతో వారు ఉచిత అంబులెన్స్‌ను రుయాకు పంపారు.

ఈ క్రమంలో ఆ అంబులెన్స్‌ డ్రైవర్‌ను రుయా అంబులెన్స్‌ డ్రైవర్లు కొట్టి పంపేశారు. తమ అంబులెన్స్‌ల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లానని పట్టుబట్టారు. దీంతో బాలుడి తండ్రి చేసేదేమీలేక ద్విచక్రవాహనంలోనే కుమారుడిని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఇటువంటి ఘటనలు గతంలోనూ జరిగాయని స్థానికులు చెబుతున్నారు. అంబులెన్స్‌ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు గానీ, పోలీసులు గానీ చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని