Published : 29 May 2022 12:33 IST

Andhra News: సోమందేపల్లిలో కుటుంబం కిడ్నాప్‌ కలకలం!

సోమందేపల్లి: శ్రీసత్యసాయి జిల్లాలోని సోమందేపల్లిలో ఓ కుటుంబాన్ని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ధర్మవరం పట్టణంలో ఓ నిరుపేద కుటుంబం రూ.90వేలు అప్పు చేసి ఓ ఇటుకల బట్టీ యజమాని దగ్గర పనికి కుదిరింది. అనివార్య కారణాలతో కుటుంబం మొత్తం యజమానికి చెప్పకుండా ఇటీవల ధర్మవరం నుంచి సోమందేపల్లికి వచ్చేశారు. వారి చిరునామాను కనుగొన్న యజమాని తరఫున కొందరు వ్యక్తులు.. శనివారం అర్ధరాత్రి వచ్చి కుటుంబం మొత్తాన్ని కిడ్నాప్‌ చేయడానికి యత్నించారు. వీరిలో ఇద్దరు బాలికలను కిడ్నాప్‌ చేసి కారులో తీసుకెళ్తుండగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కారుతో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని