Published : 13 Apr 2022 13:11 IST

Crime News: తుపాకీ పట్టుకొని తిరుగుతోన్న టీచర్‌ అరెస్ట్‌...

మెయిన్‌పురి: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మెయిన్‌పురీలో మంగళవారం ఓ మహిళా టీచర్‌ తుపాకీ పట్టుకొని తిరగటం కలకలం రేపింది. పోలీసులు ఆమె వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కొత్వాలి ప్రాంతంలో ఓ మహిళ తుపాకీతో తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ మహిళను పట్టుకొని ఆమె వద్ద ఉన్నకంట్రీ మేడ్‌ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలని కరిష్మా సింగ్‌ యాదవ్‌గా గుర్తించారు. ఫిరోజాబాద్‌లోని ఓ స్కూల్లో ఆమె పని చేస్తున్నట్లు సమాచారం. నిందితురాలని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని