ప్రేమజంటను వేధించిన వ్యవహారంలో ఉప్పల్‌ సీఐపై వేటు..

ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఓ ప్రేమజంట ఇచ్చిన ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పోలీసుశాఖ చర్యలు తీసుకుంది. 

Published : 23 Jun 2024 15:18 IST

హైదరాబాద్‌: ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఓ ప్రేమజంట ఇచ్చిన ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పోలీసుశాఖ చర్యలు తీసుకుంది. అసలేం జరిగిందంటే.. ఉప్పల్ హెచ్ఎండీఏ లేఅవుట్‌లోకి వచ్చే జంటలను పోకిరిలు బెదిరిస్తున్నారు. వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. తమనూ అలాగే బెదిరించి రూ.3లక్షలు వసూలు చేశారని బాధిత జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారికి న్యాయం చేయాల్సిన ఎస్సై శంకర్ పోకిరిలకు మద్దతుగా నిలిచారు. దీంతో బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో విచారించి.. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై శంకర్‌ను ఇప్పటికే డీసీపీ ఆఫీస్‌కు అటాచ్ చేయగా.. తాజాగా రాచకొండ సీపీ తరుణ్ జోషి సీఐ ఎలక్షన్ రెడ్డిని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని