పోస్టుమాస్టర్‌ నిర్వాకం : 24 కుటుంబాల ఎఫ్‌డీ సొమ్ము కాజేసి.. క్రికెట్‌ బెట్టింగ్‌లో పెట్టి..

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాల్సినే ఓ వ్యక్తి వ్యసనాలకు బానిసై గాడితప్పాడు. పేదలు దాచుకొన్న సొమ్ముతో బెట్టింగ్‌లు కాసాడు.

Updated : 25 May 2022 12:16 IST

భోపాల్‌ : బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాల్సిన ఓ అధికారి వ్యసనాలకు బానిసై గాడితప్పాడు. పేదలు దాచుకొన్న సొమ్ముతో బెట్టింగ్‌లు కాసాడు. చివరికి అంతా కోల్పోయి ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని బినా సబ్‌పోస్టాఫీస్‌  పోస్టుమాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న విశాల్‌ అహిర్వార్‌.. క్రికెట్‌ బెట్టింగ్‌లు కాస్తుంటాడు. తాజాగా జరుగుతోన్న భారత టీ20లీగ్‌ మ్యాచ్‌లో అతడు రూ.కోటి వరకు బెట్టింగ్‌లపై పెట్టాడు. అయితే.. అది అతడి సొంత సొమ్ము కాదు. అతడు పనిచేసే పోస్టాఫీస్‌లోని డబ్బు అది. దాదాపు 24 కుటుంబాలు దాచుకున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సొమ్మును అక్రమంగా కాజేసి క్రికెట్‌ బెట్టింగ్‌లలో పెడుతున్నాడు. గత రెండేళ్లుగా ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడిపిస్తున్నాడు. అయితే.. ఇటీవల పెద్దమొత్తంలో నష్టపోవడంతో.. ఆ అధికారి బెట్టింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు ఆ అధికారిని మే 20న అరెస్టు చేసి విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకొన్నాడు. ఫేక్‌ ఎఫ్‌డీ అకౌంట్ల కోసం అసలైన పాస్‌బుక్‌లు జారీ చేసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడిని పోలీసులు విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు