Gas Heater: గ్యాస్‌ హీటర్‌తో ఊపిరాడక భార్యాభర్తల మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్‌ జిల్లాలో గ్యాస్‌ హీటర్‌ కారణంగా ఊపిరాడక భార్యాభర్తలు మృతిచెందారు.

Updated : 18 Dec 2022 08:08 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్‌ జిల్లాలో గ్యాస్‌ హీటర్‌ కారణంగా ఊపిరాడక భార్యాభర్తలు మృతిచెందారు. వారి నాలుగు నెలల చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. అక్రోలి గ్రామానికి చెందిన సల్మాన్‌ స్థానికంగా మెడికల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నారు. తన భార్య, నాలుగు నెలల చిన్నారితో అదే ప్రాంతంలో ఉంటున్నాడు. అయితే శనివారం ఉదయం పది గంటల వరకు నిద్రలేవకపోవడం వల్ల కింద ఇంటిలో ఉన్న బంధువులకు అనుమానం వచ్చింది. పైకి వెళ్లి చూసేసరికి లోపల తాళం వేసి ఉంది. తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లి చూడగా.. సల్మాన్‌ దంపతులు, చిన్నారి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. గ్యాస్‌ హీటర్‌ కూడా పూర్తిగా కాలిపోయి కనిపించింది. బంధువులు.. సల్మాన్‌ దంపతులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారిని మరో ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని