TS News: వనమా రాఘవ అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఏ-2 నిందితుడు వనమా రాఘవను శుక్రవారం రాత్రి...

Updated : 07 Jan 2022 23:44 IST

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఏ-2 నిందితుడు వనమా రాఘవను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని దమ్మపేట మండలం మందలపల్లి, ఏపీ సరిహద్దు ప్రాంతం చింతలపూడి మధ్య రాఘవ పోలీసులకు దొరికాడు. విచారణ కోసం రాఘవను కస్టడీలోకి తీసుకున్నారు.

రాఘవ వేధింపుల వల్లే తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నాగ రామకృష్ణ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆయన సెల్ఫీ వీడియో గురువారం బయటకు వచ్చింది. ఆ వీడియోలో రాఘవపై నాగ రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో పలు ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు రాఘవను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెరాస ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని