Karimnagar: లింగనిర్ధరణ.. ఆస్పత్రిని సీజ్‌ చేసిన వైద్యాధికారులు

లింగ నిర్ధరణ పరీక్షలు చేసినట్లు తేలడంతో కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని విజయసాయి ఆస్పత్రిని వైద్యాధికారులు సీజ్‌ చేశారు.

Updated : 15 May 2023 19:34 IST

జమ్మికుంట: లింగనిర్ధరణ పరీక్షలు చేయడంతో కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని విజయసాయి ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారంతో జమ్మికుంటలోని మూడు ప్రైవేటు ఆస్పత్రుల్లో జిల్లా వైద్యాధికారిణి లలితాదేవి ఆధ్వర్యంలో 3 బృందాలు తనిఖీలు నిర్వహించాయి. విజయసాయి ఆస్పత్రిలో ఓ మహిళకు లింగనిర్ధరణ పరీక్షలు చేసి గర్భవిచ్ఛిత్తి (అబార్షన్‌) చేశారని తేలడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. లింగ నిర్ధరణకు ఉపయోగించిన ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ యంత్రాన్ని అధికారులు సీజ్‌ చేశారు. ఆస్పత్రిలో రోగులను చేర్చుకోవద్దంటూ నోటీసులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని