YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో సాక్షి అనుమానాస్పద మృతి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం

Updated : 09 Jun 2022 11:25 IST

యాడికి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న కల్లూరి గంగాధర్‌రెడ్డి (49) అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన చనిపోయారు. నిద్రపోయిన సమయంలో గంగాధర్‌రెడ్డి మృతి చెందినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఘటనాస్థలానికి క్లూస్‌టీమ్‌ చేరుకుని పరిశీలించింది. అనంతరం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

స్వస్థలం పులివెందులే..
కల్లూరు గంగాధర్‌రెడ్డి అలియాస్‌ కువైట్‌ గంగాధర్‌రెడ్డి స్వస్థలం పులివెందుల. పదేళ్ల క్రితం ఆయన యాడికికి మకాం మార్చారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ పలు నేరాలు చేశారు. వివేకా హత్య కేసులో గతేడాది అక్టోబర్‌ 2న సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసును తనపై వేసుకుంటే రూ.10కోట్లు ఇస్తానని శివశంకర్‌రెడ్డి చెప్పినట్లు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో గంగాధర్‌రెడ్డి పేర్కొన్నారు. మెజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించిన ఆయన.. ఆ తర్వాత సీబీఐ అధికారులపైనే అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని