Telangana news: వరంగల్‌ ప్రజావాణిలో వ్యక్తి ఆత్మహత్యా యత్నం..

ప్రజావాణి కార్యక్రమంలో వరంగల్‌ కలెక్టర్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఫిర్యాదులు వచ్చిన వ్యక్తి తన అర్జీని అధికారులకుఅందించి, వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్‌ మూత తీసి శరీరంపై పోసుకుంటుండగా సిబ్బంది గమనించి అతన్ని నిలువరించారు.

Published : 09 May 2022 18:07 IST

వరంగల్‌‌: ప్రజావాణి కార్యక్రమంలో వరంగల్‌ కలెక్టర్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఫిర్యాదులు వచ్చిన వ్యక్తి తన అర్జీని అధికారులకు అందించి, వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్‌ మూత తీసి శరీరంపై పోసుకుంటుండగా సిబ్బంది గమనించి అతన్ని నిలువరించారు. నగరంలోని గొర్రెకుంటకు చెందిన రఘురాం పత్తి మిల్లు నడిపిస్తున్నాడు. కొద్ది రోజులుగా కాటన్ సెక్షన్ ప్రెసిడెంట్ తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేశాడు. అయినా తన సమస్య పరిష్కారం కాకపోవటంతో మనస్థాపం చెందిన రఘురాం ఆత్మహత్యకు యత్నించాడు. ‘కాటన్‌ సెక్షన్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీ అక్రమంగా లాట్‌కు రూ.500, రూ.వెయ్యి అని వసూలు చేసి సీసీఐ పర్చేజింగ్‌ అధికారికి ఇప్పించారు. ఆ డబ్బులు అడిగితే ఇచ్చేది లేదంటూ బెదిరించి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మాకు రూ.25 లక్షల నష్టం వచ్చింది. ఇల్లు కుదువ పెట్టి, బ్యాంకులో ఓడీ తెచ్చి డబ్బులు ఇచ్చామని’ రఘురాం తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని